Serial Actresses: దొంగతనం కేసులో అరెస్టైన ఇద్దరు నటీమణులు!

హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఇద్దరు నటీమణులు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఇద్దరూ కలిసి ముంబైలోకి లావిష్ ఏరియాలో పేయింగ్ గెస్టులుగా దిగారు.

Serial Actresses: దొంగతనం కేసులో అరెస్టైన ఇద్దరు నటీమణులు!

Serial Actresses

Serial Actresses: హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఇద్దరు నటీమణులు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఇద్దరూ కలిసి ముంబైలోకి లావిష్ ఏరియాలో పేయింగ్ గెస్టులుగా దిగారు. అదే సొసైటీలో గెస్ట్ గా ఉన్న మరో మహిళ వద్ద నుండి మూడు లక్షల నగదు దోచుకొని అక్కడ నుండి పరారయ్యారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నటులను అరెస్ట్ చేశారు.

హిందీలో ప్రముఖ టీవీ షోలు ‘సావ్​ధాన్​ ఇండియా’, ‘క్రైమ్​ పెట్రోల్’​లో నటించిన ఇద్దరు నటీమణులు మే 18న ముంబయి ఆరే కాలనీలోనీ రాయల్​ పామ్​ ఏరియాలో ఓ ఇంట్లో పేయింగ్​ గెస్ట్​గా వెళ్లారు. అప్పటికే అక్కడ ఉంటున్న ఓ మహిళ దగ్గర ఉన్న రూ.3.28 లక్షల నగదు మాయమైంది. దీంతో ఆ ఇద్దరు నటులపై అనుమానంతో ఆ మహిళ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

సీసీ కెమెరాల ద్వారా ఆ ఇద్దరే ఈ దొంగతనం చేశారని నిర్ధరించుకొని పారిపోయిన ఆ ఇద్దర్నీ ట్రేస్ చేసి పట్టుకొని అరెస్టు చేసి దోచుకున్న సొమ్ములో రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ దొంగతనానికి పాల్పడ్డామని ఆ ఇద్దరూ ఒప్పుకోగా.. చివరికి కటకటాల పాలయ్యారు.