Prabhas Anushka : 8 ఏళ్ళ తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి..? అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే.. సినిమా కాదు కానీ స్పెషల్..
అనుష్క, ప్రభాస్ కలిసి కనిపించి ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కనిపించబోతున్నారు.(Prabhas Anushka)

Prabhas Anushka
Prabhas Anushka : ప్రభాస్, అనుష్క జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్టులలో కలిసి నటించి హిట్ పెయిర్ అనిపించుకోవడమే కాకుండా అందరిని మెప్పించారు కూడా. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. ఈ ఇద్దరూ 40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.(Prabhas Anushka)
అనుష్క, ప్రభాస్ కలిసి కనిపించి ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయిపోయింది. బాహుబలి 2 ప్రమోషన్స్ లో అనుష్క – ప్రభాస్ కలిసి కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ కలిసి కనపడలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కనిపించబోతున్నారు. స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ కోసమట.
అనుష్క నటించిన ఘాటీ సినిమా ఇప్పటికే అనేక వాయిదాలు పడి సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. కానీ ప్రమోషన్స్ మాత్రం లేవు. దీంతో మూవీ యూనిట్ ప్రభాస్ – అనుష్కలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమాకు హైప్ తెద్దామని ప్లాన్ చేశారట. అనుష్కని ఘాటీ సినిమా గురించి ప్రభాస్ ఇంటర్వ్యూ చేయనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆ ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేస్తారని సమాచారం.
నిజంగానే ప్రభాస్ – అనుష్క స్పెషల్ ఇంటర్వ్యూ జరిగితే ఫ్యాన్స్ కి ఫుల్ పండగే. ఈ ఇద్దరూ కలిసి కనపడటం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల బాహుబలి 10 ఇయర్స్ రీ యూనియన్ జరిగి అందరూ హాజరయినా అనుష్క మాత్రం రాలేదు. వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయకపోయినా ఈ ఇంటర్వ్యూతో అయినా కనిపిస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. మరి నిజంగానే ఈ ఇంటర్వ్యూ జరుగుతుందా? ఈ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు వీళ్ళ పెళ్లి టాపిక్ వస్తుందా చూడాలి.