సహచర ఉద్యోగి ఇంట్లో పెళ్లికి వెళ్లి … దావత్ లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం పుచ్చుకుని డ్యాన్సులు చేయడంతో సస్పెన్షన్ కు గురయ్యారు షాద్ నగర్ పోలీసులు. కొత్తూరు పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనే కానిస్టేబుల్ కూతురు వివాహం ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం దేవాలయం సమీపంలో జరిగింది.
పెళ్లికి వెళ్ళిన సహఉద్యోగులు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో పెళ్లి సందర్భంగా మందు పార్టీ నిర్వహించుకొన్నారు. మద్యం సేవించిన తర్వాత మద్యం బాటిళ్లు నోట్లో పెట్టుకుని ఏఎస్ఐ బాలస్వామి,హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, అశోక్ రెడ్డి అమరనాథ్ రెడ్డి ,రామకృష్ణ రెడ్డి చంద్ర మౌళి తో పాటు మరికొంత పోలీస్ సిబ్బంది నాగిని డ్యాన్స్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అయ్యింది. వారం రోజుల క్రితమే సీఐ శ్రీధర్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ లో చేసిన నిర్వాకానికి ఆయన సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏ.ఎస్సై.నలుగురు కానిస్టేబుళ్లు నాగిని డ్యాన్స్ చేసి పోలీసు ప్రతిష్ట దిగజార్చటంతో వారిని సీపీఆఫీసుకు ఎటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.