Tirumala Robbery Case: తిరుమలలో భక్తురాలికి మత్తుమందు ఇచ్చి చైన్ చోరీ కేసు.. నిందితురాలు అరెస్ట్.. ఇలా గుర్తించారు
సాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ నిందితురాలిని గుర్తించారు.
Tirumala Representative Image (Image Credit To Original Source)
- దర్శనం కోసం వేచి చూస్తున్న సమయంలో చోరీ
- మత్తుమందు ఇచ్చి గోల్డ్ చైన్ దొంగతనం
- సాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలి గుర్తింపు
Tirumala Robbery Case: తిరుమలలో భక్తురాలికి మత్తుమందు ఇచ్చి తాళిబొట్టు చైన్ చోరీ చేసిన కేసులో వన్ టౌన్ పోలీసులు పురోగతి సాధించారు. చైన్ చోరీ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి చెందిన వృద్ధురాలు విజయ (63) తిరుమలకు వచ్చింది. 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 20వ కంపార్ట్ మెంట్ లో వేచి ఉంది. అదే సమయంలో.. వృద్ధ మహిళకు మత్తుమందు ఇచ్చి 57 గ్రాముల బరువున్న తాళిబొట్టు చైన్ చోరీని కర్ణాటకకి చెందిన నాగిశెట్టి నాగరత్నమ్మ చోరీ చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ నిందితురాలిని గుర్తించారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి 57 గ్రాముల బరువున్న బంగారు తాళిబొట్టు చైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Also Read: మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
