Water Heater: ప్రాణం తీసిన వాటర్ హీటర్.. అక్కాచెల్లెళ్లు మృతి.. ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
అక్క చెల్లెలి మృతితో ఆ ఇంట్లో పెను విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. Water Heater
Water Heater Representative Image (Image Credit To Original Source)
- వాటర్ హీటర్ తో జాగ్రత్త
- ఇద్దరి ప్రాణం తీసిన వాటర్ హీటర్
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో విషాదం
- వాటర్ హీటర్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి
Water Heater: నీళ్లను వేడి చేసేందుకు వాడే ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ రాడ్ ప్రాణాలు తీస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ రాడ్ ఇద్దరి ప్రాణం తీసింది. అక్కా చెల్లెళ్లు చనిపోయారు. రామ్ పురి ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులు అక్క, చెల్లెలు. ఒకరి పేరు నిధి. వయసు 21 ఏళ్లు. మరొకరి పేరు లక్ష్మి. వయసు 19 ఏళ్లు. నీళ్లను వేడి చేసే సమయంలో నిధి ప్రమాదవశాత్తు రాడ్ ని టచ్ చేసింది. అంతే తీవ్రమైన కరెంట్ షాక్ కి గురైంది. ఇది గమనించిన లక్ష్మి.. తన అక్కని కాపాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా కరెంట్ షాక్ కి గురైంది. ఇద్దరూ స్పాట్ లోనే మరణించారు. అక్క చెల్లెలి మృతితో ఆ ఇంట్లో పెను విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడకం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* నీళ్లను వేడి చేసేందుకు ప్లాస్టిక్ బకెట్ నే వాడాలి.
* ఇనుప బకెట్లు వాడొద్దు.
* రాడ్ కు సపోర్ట్ గా కర్ర లేదా ప్లాస్టిక్ నే వాడాలి.
* హీటర్ ని నీళ్లలో పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి.
* హీట్ అవుతున్నప్పుడు నీళ్లను కానీ బకెట్ ను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దు.
* నీళ్లు వేడి అయ్యాక స్విచ్చాఫ్ చేశాకే రాడ్ ను బయటకు తీయాలి.
Also Read: రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌట్..కానీ, ఈ రూల్స్ పాటించాలి..
ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..
* అరిగిన లేదా పాత వాటర్ హీటర్ రాడ్‌ను వాడొద్దు.
* స్విచ్చాన్ చేశాక బకెట్‌లో నీటిని పోయొద్దు. దీనివల్ల తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది.
* హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడు బకెట్ నుండి వేడి నీటిని తీసుకోవడం మానుకోండి.
* నీరు వేడెక్కిన తర్వాత స్విచ్చాఫ్ చేశాక సుమారు 15-20 సెకన్లు వేచి ఉండండి. ఆ తర్వాతే రాడ్‌ను నీటిలో నుండి బయటకు తీయాలి.
* ఓవర్ హీట్ చేయొద్దు- కొంతమంది హీటింగ్ రాడ్‌లను చాలా సేపు ఆన్‌లో ఉంచుతారు. ఇది సురక్షితం కాదు. మీ నీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేడి చేయండి.
* కొనుగోలు చేసేటప్పుడు తెలివిగా ఎంచుకోండి: మీరు కొత్త ఇమ్మర్షన్ రాడ్‌ను కొనుగోలు చేస్తుంటే, ఐఎస్‌ఐ మార్క్ ఉన్న దానిని ఎంచుకోండి. దాని వోల్టేజ్ 1500 నుండి 2000 వాట్ల మధ్య, 230-250 వోల్టులు ఉండేలా చూసుకోండి.
* బకెట్‌లో తగినంత నీరు ఉండేలా చూసుకోండి. తద్వారా రాడ్ పూర్తిగా మునిగిపోతుంది.
ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా, మీరు వాటర్ హీటర్ రాడ్‌లను మరింత సురక్షితంగా ఉపయోగించొచ్చు. ప్రమాదాలను నివారించొచ్చు.
