Sivaji Ganesan : తమిళ హీరో ప్రభు, ఆయన సోదరుడిపై కోర్టులో కేసు

ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.

Sivaji Ganesan :  ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తన సోదరుడు ప్రభు తమను మోసం చేశాడని నడిగర తిలకం శివాజీ గణేశన్ కుమార్తెలైన శాంతి, రజ్వీలు టాలీవుడ్ హీరో ప్రభు, ఆయన సోదరుడు నిర్మాత రామ్‌కుమార్‌లపై మద్రాస్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నడిగరతిలకం, శివాజీగణేశన్‌కు ప్రభు, రామ్‌కుమార్ అనే ఇద్దరు కుమారులు…శాంతి నారాయణ స్వామి, రజ్వీ గోవిందరాజన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే శివాజీ గణేశన్‌ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. ఇది కాస్తా ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగా పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు. అదే విధంగా తండ్రి మరణించే నాటికి ఇంట్లో వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను.. వజ్రాల ఆభరణాలు, ప్రభు, రామ్‌ కుమార్‌ అపహరించారని పిటీషన్‌లో పేర్కోన్నారు. శివాజీ గణేషన్‌కు చెందిన శాంతి థియేటర్లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు  కుమార్తెలు పిటీషన్ లో  ఆరోపించారు.

తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై   సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్‌ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్‌లో వారి పేర్లను పేర్కొన్నారు. తమ సోదరులు ఆస్తుల అమ్మకం గురించి తమకు తెలియ చేయలేదని వారు పేర్కోన్నారు.

తండ్రి మరణం తర్వాత ఆస్తులను ఏకీకృతం చేసి, నిర్వహించి అభివృధ్ది చేస్తామని… వారసుల మధ్య వాటాలను సమానంగా పంచుకుంటామని తమ సోదరులు తమతో చెప్పారని  అక్క చెల్లెళ్ళు  పిటీషన్ లో పేర్కోన్నారు. అందులో భాగంగా తమతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డీడ్ పై సంతకాలు తీసుకుని ఇప్పుడు వాటిని వాళ్లిద్దరే అమ్ముకుంటూ… అనుభవిస్తున్నారని తెలిపారు. కాగా ఈవిషయమై ప్రభు,రామ్ కుమార్ లు ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు