Milicias arrest
Telangana : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం-పెద్దఉట్లపల్లి గ్రామాల మధ్య ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను హతమార్చటానికి మిలీషియా సభ్యులు మందు పాతరలను రోడ్డుపై అమర్చుతుండగా… స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మిలీషియా సభ్యులు పేలుడు పదార్థాలు అమర్చుతున్నారనే పక్కా సమాచారంతో స్పెషల్ పార్టీలతో కూంబింగ్ నిర్వహించగా వీరు తారస పడ్డారు. పోలీసులను చూసిన మిలీషియా సభ్యులు పారిపోవటానికి ప్రయత్నించగా వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు ములుగు ఓఎస్డీ శోభన్ కుమార్ వివరించారు.
Also Read : Omicron Variant : గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. శనివారం ఉదయానికి 1,431 కేసులు
ఘటనా స్థలంలో రెండు టిఫిన్ బాక్సులు, కార్డ్ ఎక్స్ వైర్, రెండు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు మిలీషియా సభ్యులపై కేసు నమోదు చేసి… రిమాండ్కు తరలించినట్లు ఓఎసీడి శోభన్ కుమార్ వెల్లడించారు. వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు.