Omicron Variant : గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. శనివారం ఉదయానికి 1,431 కేసులు

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. ఇక శనివారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరింది

Omicron Variant : గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. శనివారం ఉదయానికి 1,431 కేసులు

Omicron Variant

Updated On : January 1, 2022 / 10:35 AM IST

Omicron Variant :  దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. ఇక శనివారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వేరియంట్ బారినపడిన వారిలో 488 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

చదవండి : Omicron : ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్

రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ 115, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 62, హర్యానా 37, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వేరియంట్ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా సోకుతోంది. మహారాష్ట్రలో ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

చదవండి : Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం..?

ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలపై కూడా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.