Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం..?

ఒమిక్రాన్‌ ఎంట్రీ తర్వాత భారత్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలొ తొలిసారిగా డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడా సంఖ్య 1270కి చేరింది.

Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం..?

Omicron (3)

first Omicron death in India : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్లు తెలుస్తోంది. పుణెకు చెందిన వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఇటీవలే నైజీరియా నుంచి పుణెకు వచ్చనిట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ధృవీకరించాల్సివుంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి. ఒమిక్రాన్‌ భారత్ లోనూ కలకలం సృష్టిస్తోంది. దేశంలో వేరియంట్ జెట్ స్పీడ్ తో వ్యాపిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్‌ ఎంట్రీ తర్వాత భారత్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు కేసులతో మొదలైన ఒమిక్రాన్‌ ప్రవాహం ఇప్పుడు ఏకంగా వెయ్యి మార్కును దాటేసింది. దేశంలొ తొలిసారిగా డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి. అంటే ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిన నెలరోజుల్లోపే కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది.

Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

రెండు కేసుల నుంచి 500 కేసుల రీచ్‌ అవ్వడానికి 25 రోజుల సమయం పడితే.. 500 కేసుల నుంచి వెయ్యి కేసులు రీచ్‌ అవ్వడానికి నాలుగంటే నాలుగు రోజులే పట్టిందంటే ఒమిక్రాన్‌ ఎలా గేర్లు మార్చిందో అర్థంఅవుతోంది. డిసెంబర్‌ 2న రెండు కేసులు, డిసెంబర్ 14న 50 ఒమిక్రాన్ కేసులు, డిసెంబర్ 17 నాటికి కేసుల సంఖ్య 100కి చేరింది. ఆ తర్వాత డిసెంబర్‌ 27 నాటికి ఆ సంఖ్య 500కు చేరగా.. ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. ఇక ఈ 8 రోజుల్లోనే ఒమిక్రాన్ సంఖ్య 5 రెట్లు వేగంగా పెరిగింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు దేశంలో కొత్తగా 16,764 కరోనా కేసులు నమోదవ్వగా 220 మంది వైరస్ బారని పడి మరణించారు. దేశంలో ప్రస్తుతం 91,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో మొత్తం 4,81,080 మరణాలు సంభవించాయి.