దారుణం : టీవీ చానల్ మార్చలేదని తండ్రినే చంపేశాడు

నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్‌ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన

  • Publish Date - October 5, 2019 / 03:28 AM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్‌ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన

నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్‌ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన గొడవ తండ్రి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు రోకలిబండతో తండ్రి తలపై మోదడంతో తీవ్ర గాయాలతో తండ్రి స్పాట్ లోనే మృతిచెందాడు. గురువారం(అక్టోబర్ 3, 2019) రాత్రి ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని ప్రకాశం బజార్‌లో నివాసముంటున్న పెరుమాళ్ల గోవర్ధన్‌ (65) గురువారం రాత్రి భక్తి టీవీ చానెల్‌ చూస్తున్నాడు. అదే సమయంలో కొడుకు సతీష్ ఆ చానల్‌ను మార్చాలని, కొత్త పాటలను పెట్టాలని రిమోట్‌ను తండ్రి చేతుల్లో నుంచి లాక్కున్నాడు.

తాను భక్తి చానల్‌ చూడాలని కొడుకు చేతుల్లో నుంచి తండ్రి రిమోట్‌ను తిరిగి లాక్కున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్.. రోకలిబండ తీసుకుని టీవీని ధ్వంసం చేశాడు. కోపంతో కొడుకు గల్లా పట్టుకున్నాడు తండ్రి. దీంతో సతీష్ మరింత రెచ్చిపోయాడు. రోకలిబండతో తండ్రి తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పదేళ్ల క్రితం గోవర్ధన్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. నాలుగేళ్ల క్రితం కూతురు జ్యోతికి వివాహం చేశారు. ఏడాది నుంచి తండ్రీకొడుకులు నల్గొండలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గోవర్ధన్ కూలీగా, సతీష్ మునుగోడు తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసైన సతీష్ ఇటీవల తండ్రితో పలుమార్లు గొడవకు పాల్పడినట్లు కూతురు తెలిసింది. రక్తం మడుగులో ఉన్న తండ్రి మంచంపైనే సతీష్ కొంతసేపు నిద్రపోయాడు. తెల్లవారు జామున లేచిన సతీష్ తండ్రి చనిపోయాడని సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు సతీష్ ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. చిన్న విషయానికే తండ్రిని కొడుకే మర్డర్ చేయడం స్థానికంగా సంచలనం రేపింది.