దారుణం : ఆవేశంలో కన్న తల్లినే…

  • Publish Date - November 12, 2019 / 01:45 PM IST

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా హత్య చేశాడు ఓ కొడుకు. జిల్లాలోని బంట్వారం మండలం, రోంపల్లి గ్రామంలో మస్తాన్(35) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి తన తల్లి మహబూబితో (58) ఘర్షణ పడ్డాడు.

ఇరువురి మధ్య ఘర్షణ తారా స్ధాయికి చేరింది. ఆ సమయంలో మస్తాన్ ఆవేశం పట్టలేక కూరగాయలు తరిగే కత్తితో తల్లిపై దాడి చేసి విచక్షణంగా పొడిచాడు. కొడుకు చేతిలో తీవ్రంగా గాయనపడిన మహబూబి అరస్తూ ఇంట్లోంచి రోడ్డు మీదకు వచ్చింది. ఇది గమనించిన స్ధానికులు ఆమెను వెంటనే తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అప్పటికే మహబూబి మరణించిందని డాక్టర్లు తెలిపారు. మృతదేహానికి  పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తల్లిని హత్యచేసిన నిందితుడు మస్తాన్ పరారీలో ఉన్నాడు.