గుంటూరు : చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేసి, విచక్షణారహితంగా నరికాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుళ్లపల్లిలోని ఊరలమ్మడొంకలో నివాసముంటున్న అనిత, మంగమ్మ, రామకృష్ణపై కుటుంబ కలహాలతో అల్లుడు ముప్పుడి వెంకట్ రావు ఏప్రిల్ 4 గురువారం తెల్లవారుజామున కత్తితో దాడి చేసి, విచక్షణారహితంగా నరికాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.