ట్యాక్స్ ఎగ్గొట్టారు : శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ ఎండీ అరెస్టు

  • Publish Date - May 7, 2019 / 04:11 AM IST

హైదరాబాద్: శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ ఎండీ ప్రదీప్‌ కుమార్‌, అతని కుమారుడు సాయిచరణ్‌ను డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు సోమవారం(మే 6, 2019) అరెస్ట్‌ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన టాక్స్ లు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపిన అధికారులు ప్రదీప్‌ కుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ప్రదీప్ కుమార్, సాయి చరణ్ లను పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. ప్రదీప్‌ కుమార్‌ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 35 జువెలరీ షాప్ లు నిర్వహిస్తున్నారు.