విషాదం : కరెంట్ షాక్ తో విద్యార్ధి మృతి

  • Publish Date - October 25, 2019 / 09:24 AM IST

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరెంట్ తీగలు తెగి పడటంతో 5 వతరగతి చదివే ఆయాన్ ఖాన్(11) అనే విద్యార్ధి కన్నుమూశాడు.

విషయం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, బాలుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.