Suicide In Metro Station : ఇటీవలి కాలంలో మెట్రో స్టేషన్లలో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మెట్రో స్టేషన్ లో సూసైడ్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నోయిడాలో చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో ఓ విద్యార్థి ఎవరూ లేని సమయం చూసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విద్యార్థి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫెన్సింగ్ దూకడం వీడియోలో గమనించవచ్చు.
Also Read..Metro Station Woman Suicide : మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
గ్రేటర్ నోయిడాలోని నాల్డెజ్ పార్క్ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. బీహార్ బగల్ పూర్ జిల్లాకు చెందిన నితీష్(21) మెట్రో స్టేషన్ పై నుంచి కిందకు దూకాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పై నుంచి కిందకు దూకడంతో అతడికి గాయాలయ్యాయి. నితీష్ బీబీఏ థర్డియర్ చదువుతున్నాడు. మంగల్ మే కాలేజీలో చదువుతున్నాడు.
అతడు కాలేజీ వెళ్లేందుకు రోజూ మెట్రో స్టేషన్ కు వెళ్లేవాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు నితీశ్ మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, నితీష్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
Also Read..Metro Station Woman Dragged : మెట్రో స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. యువతిని ఈడ్చుకెళ్లిన రైలు
మెట్రో స్టేషన్ లోకి వెళ్లిన నితీశ్.. కాసేపు అటు ఇటు తిరిగాడు. చుట్టూ గమనించాడు. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న అతడు.. మెట్రో స్టేషన్ ఫెన్సింగ్ వైపు పరిగెత్తాడు. ఫెన్సింగ్ ని జంప్ చేశాడు. అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
#CCTV video purportedly of Greater Noida’s Knowledge Park Metro station where a #BBA student committed suicide।#Noida #Noidametro #RamCharan #ShivIsTheBoss #NandamuriBalakrishna #JrNTR #Uzbekistan #Shehzada #JAEMINxFENDI #KritiSanon #NimritKaurAhluwalia #Kuttey pic.twitter.com/ymHLyxiBxd
— TejasswiPrakash (@Tejasswi22) January 12, 2023