వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కడప : వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయనను కత్తితో దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా తొడపై కత్తిపోటు ఉన్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా వివేకా ఇంటి చుట్టూనే తిరిగింది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటి వాచ్ మెన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివేకా శరీరంపై బలమైన గాయాలున్నట్లు తెలుస్తోంది. తల వెనుక, నుదుటిపై గాయాలున్నాయి. చేతికి కూడా గాయం అయింది. వివేకానంద ఇవాళ ఉదయం మృతి చెందారు. బాత్ రూమ్ లో ఆయన మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. ఆయన బెడ్ రూమ్ లో కూడా రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వివేకాది సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మృతదేహం పడి ఉన్న తీరు పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది.