రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు. తహశీల్దార్ ఆఫీస్ లోనే ఈ ఘాతుకం జరిగింది.
తహశీల్దార్ సజీవ దహనం ఘటన కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్త చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్ లోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒక్కసారిగా ఆమెపై పోసి నిప్పంటించాడు.
మంటలు చెలరేగడంతో విజయ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన విజయ.. కారిడార్ లో కుప్పకూలారు. కాసేపటికే చనిపోయారు. తహశీల్దార్ ఆఫీస్ రోడ్డుపైనే ఉంటుంది. ఈ ఘటన ఆఫీస్ సిబ్బందిని, స్థానికులను షాక్ కు గురి చేసింది. తహశీల్దార్ తో మాట్లాడాలి అంటూ లోనికి వచ్చిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.