×
Ad

ఇంట్లోనే వైన్ తయారుచేస్తున్న తండ్రి-కొడుకులు అరెస్టు

  • Publish Date - May 4, 2020 / 10:41 AM IST

తండ్రి, కొడుకుతో పాటు మరో వ్యక్తి కలిసి ఇంట్లో వైన్ తయారుచేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ద్రాక్ష వైన్ తయారుచేసే పనిలో భాగంగా గంజి లాంటి ఇంటాక్సికంట్‌ను ఇంట్లోనే రెడీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇతర వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి ఇంట్లో సోదాలు జరిపారు. 

చెన్నైలోని కొడుంగయూర్‌లోని ఇంట్లో 56ఏళ్ల వ్యక్తి 26ఏళ్ల కొడుకుతో పాటు మరో వ్యక్తి కలిసి వైన్ తయారుచేస్తున్నారు. 30లీటర్ల ద్రాక్ష వైన్, 5లీటర్ల సుందా కంజీ అనే మరో ద్రావకంతో పట్టుబడ్డారు. అందులో అన్నం కూడా వాడి పులియబెడుతున్నారని వాటిని అన్నింటినీ స్వాధీన పరచుకున్నట్లు సమాచారం. 

విచారణ జరిపిన తర్వాత ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 24 సాయంత్రం నుంచి రాష్ట్రం నిర్వహిస్తున్న TASMAC లిక్కర్ షాపులన్నీ మూసేయించి తమిళనాడు ప్రభుత్వం. 

See Also | లిక్కర్ షాప్స్ ఓపెన్ : ఒకరు కొబ్బరికాయ కొట్టారు..మరొకరు బాంబులు పేల్చారు