Teenage Girl Posted Nude Photos Videos
Online Classes : కరోనా లాక్ డౌన్ కాదు కానీ, అంతకు ముందు క్లాస్ రూం కి ఫోన్ అనుమతించని స్కూళ్లు ఇప్పుడు అన్నీ ఫోన్లలోనే నిర్వహిస్తున్నాయి. గతేడాది లాక్ డౌన్ మొదలైన దగ్గర్నించి మొదలైన ఆన్ లైన్ క్లాసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేపో మాపో స్కూళ్లు తెరుస్తామని ప్రభుత్వాలు చెపుతున్నాయి. పిల్లల ఆన్ లైన్ క్లాసులు కోసం తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు కొనిచ్చి పిల్లలకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
చాలామంది పిల్లలు ఫోన్ చేతిలోకి వచ్చేసరికి అందులో ఉండే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేస్తూ పెద్దలకు తలనొప్పిని తెచ్చిపెట్టారు. సోషల్ మీడియాలోకి ఎంటరై పిచ్చి పనులు చేసినవాళ్లు కొందరైతే, ఆన్ లైన్ గేమ్ లు ఆడి డబ్బులు పోగొట్టుకున్నవాళ్లు మరికొందరు. గుజరాత్ లోని ఒక బాలిక స్మార్ట్ ఫోన్ ను దుర్వినియోగ పరిచి తల్లితండ్రులకు గుండెనొప్పిని తెచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది.
గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు చెందిన బాలిక(15)కు తల్లితండ్రులు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు కొన్నిరోజుల క్రితం ఒక స్మార్ట్ ఫోన్ ను కొనిచ్చారు. బాలిక క్రమం తప్పకుండా ఆన్ లైన్ క్లాసులు వింటోంది. ఇటీవల ఆమె తల్లి తండ్రులు సోషల్ మీడియాలో బాలిక నగ్నవీడియో చూశారు. ఈ వీడియో సంగతిని వాళ్ల బంధువులు వారికి చెప్పారు. అది చూసి వారికి గుండెపోటు వచ్చింది, బంధువుల సహాయంతో వారిరువురినీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆన్ లైన్ క్లాసులు మొదలైన తర్వాత తమ పిల్లకు ఇబ్బంది లేకుండా ఉండటానికి తల్లి తండ్రులు ఒక రూమ్ కేటాయించారు. ఫోన్ కొనిచ్చారు. ఆన్ లైన్ క్లాసులు వింటున్న సమయంలో బాలికకు ఒక పోర్న్ వెబ్ సైట్ కనిపించింది. అది క్లిక్ చేసి చూడగా అందులో అన్నీ నగ్నచిత్రాలు, వీడియోలు కనిపించాయి. వాటికి బాలిక కామెంట్లు చేయటం మొదలు పెట్టింది. వాటికి ప్రతిస్పందనలు రావటంతో బాలికలో ఉత్సాహం పెరిగింది. ఈక్రమంలో ఆ వెబ్ సైట్ ద్వారా కొందరు పరిచయం అయ్యారు.
ఆన్ లైన్ క్లాసులు పేరుతో బాలిక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పరిచయం అయిన వారితో ఎక్కువగా కాలక్షేపం చేయసాగింది. వారు పలు నగ్నవీడియోలు పోస్ట్ చేసి బాలికను కామెంట్ పెట్టమనేవారు. ఈక్రమంలో కొందరు బాలిక నగ్నవీడియోను కూడా పోస్ట్ చేయమని కోరారు. ఆన్ లైన్ లో ప్రెండ్స్ తరచూ అడుగుతూ ఉండటంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియోను పోస్ట్ చేసి కామెంట్ చేయని ప్రోత్సహించింది. దీంతో పలువురు ఆమె నగ్నవీడియోలు చూసి కామెంట్లు పెట్టారు.
అది చూసి ఆనందంతో తన బంధువుల పిల్లలను కూడా ఆ వెబ్ సైట్ ఫాలో అవ్వాలని సూచించింది. మీరు కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవాలని కొందరికి సూచించింది. ఈవిషయాన్ని ఆ బాలికలు వారి తల్లితండ్రులకు చెప్పారు. దీంతో వారు తమ పిల్లలకు చివాట్లు పెట్టి ఈ బాలిక తల్లితండ్రుల వద్దకు వచ్చి విషయం చెప్పారు. వారు చెప్పిన సైట్ లో తమ పిల్ల వీడియోలు చూసి ఆవేదనతో వారికి గుండె నొప్పి వచ్చింది.
బంధువులు వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. దీనిపై 181 కి ఫిర్యాదు చేసి బాలికకు సంబంధించిన వీడియోలు చిత్రాలు తొలగించేశారు. ఏది ఏమైనా పిల్లలు ఆన్ లైన్ క్లాసులో పాఠాలు వింటున్నప్పడు కానీ, తర్వాత కానీ తల్లి తండ్రులు వారిపై ఓకన్నేసి ఉంచటం.. వారికిచ్చిన స్మార్ట్ ఫోన్ లో బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేయటం తప్పని సరిగా చేస్తుండాలి.