teenage girls violated traffic rules : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన యువతులు ఫైన్ వేసిన పోలీసులను దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం నందికొండ చెక్ పోస్టు వద్ద ఆదివారం జరిగింది.ఆదివారం ఉదయం బెంగుళూరు కు చెందిన నలుగురు యువతులు హెల్మెట్ లేకుండా నందికొండకు వచ్చారు.
కొండకు వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు వారిని ఆపి హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేశారు. దీంతో ఆగ్రహించిన యువతులు పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. పోలీసులను పరుష పదజాలంతో దుర్భాషలాడారు. ఫైన్లు కట్టమని మొండికేశారు. పోలీసులు సంయమనం కోల్పోకుండా వారికి విధించని జరిమానా రసీదులు ఇచ్చి పంపించారు.