Telangana man gets death penalty for rape, murder of 6 years girl : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన మృగాడికి రంగారెడ్డి జిల్లా కోర్టు తగిన శిక్ష విధించింది. దినేష్ కుమార్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం నిందితుడు దినేష్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
2017 లో జరిగిన ఈ కేసులో నిందితుడు దినేష్ కుమార్ ఆరేళ్ళ చిన్నారి బాలికను లేబర్ క్యాంపుకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుడికి ఈ హత్యతో సంబంధం ఉన్న సాక్ష్యాధారాలను బలంగా సేకరించి కోర్టుకుసమర్పించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు పరిశీలించిన న్యాయస్ధానం దినేష్ కుమార్ ను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.