అక్క కాదు.. చెల్లి కాదు.. ఎలాంటి బంధం లేదు.. అయినా వాళ్లను చంపేస్తాం

  • Publish Date - November 30, 2019 / 10:19 AM IST

షాద్ నగర్ ‌పీఎస్ వద్ద తీవ్ర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది పోలీస్ స్టేషన్ వద్ద మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కకు వచ్చిన ప్రజలకు మృ‌తి చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రతొక్కరూ ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు. నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిలో ప్రియాంక..అన్నా..చెల్లే..తమ్ముడు..బంధువులు ఎవరూ లేరు. కానీ ఎలాంటి బంధం లేకపోయినా…అంతా ప్రియాంక తమ కుటుంబసభ్యురాలిగా భావిస్తున్నారు. అక్కగా కొందరు..చెల్లిగా ఇంకొందరు..బిడ్డగా మరికొందరు. ప్రియాంకకు జరిగిన అన్యాయం..తమ ఇంటి ఆడపడుచుకు జరిగినట్లుగా భావిస్తున్నారు.

ఈ రోజు ప్రియాంకు జరిగింది..రేపు…మరొక్కరికి జరగొచ్చని అంటున్నారు. ఇలాంటి దారుణాలు మరిన్ని జరగకుండా ఉండాలంటే…నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే ఇలాంటి మృగాళ్లు..మళ్లీ నేరం చేసేందుకు జంకుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక రేప్..అండ్ మర్డర్ కేసు..తెలుగు రాష్ట్రాల్లో పతొక్కరిని కదిలించి వేసింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. పీఎస్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. 

జనం వేలాదిగా తరలివచ్చారు. ఇందులో విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, స్థానికులు, యువత ఉన్నారు. చట్టానికి లోబడి పోలీసులు ఏం చేయడం లేదని..తమకు అప్పగిస్తే..ఇక్కడే చంపేస్తామని..ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే..షాద్ ‌నగర్‌లోనే చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు పోలీసులు..ఆందోళనకారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీలిస్తున్నారు. ఇక్కడ శాంతిభద్రతల ఇష్యూ ఉంది..అందరూ వెళ్లిపోవాలంటున్నారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అక్కడనే నిల్చొన్నారు. ఉదయం నుంచి అక్కడనే ఉన్న ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి డాక్టర్ ప్రియాంక రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడుతాయా ? లేదా ? అనేది చూడాలి. 
Read More : షాద్‌నగర్‌‌లో తిరగబడ్డ జనాలు : పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం..ఉద్రిక్తత