హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్య హత్యతో ఎలాంటి సంబంధం 10టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. శ్రిఖా ఇంటర్వ్యూపైనా జయరాం భార్య పద్మశ్రీ స్పందించారు. 10Tvకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రిఖా చెప్పేవన్నీ అబద్దాలే అని కొట్టి పారేశారు.
కేవలం నాలుగున్నర కోట్లు వసూలు చేసుకునే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు వస్తున్న వార్తలను కూడా పద్మశ్రీ కొట్టి పారేశారు. “మాకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, ఎందుకు అప్పు తీసుకున్నారనేది అర్ధం కావటం లేదన్నారు పద్మశ్రీ. నాకు న్యాయం ఏ రాష్ట్రం చేస్తుందో అర్ధం కావటం లేదన్నారు. కేవలం రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు మూసేస్తారా అని ప్రశ్నించారు. విచారణ తీరుపైనా అనుమానం వ్యక్తం చేశారు. జయరామ్ ను శ్రిఖా చౌదరి జలగ లాగా రక్తం పిండేసి వదిలేసిందని ఆరోపించారు. సొంత మేనకోడలు ఈ విధంగా చేయటం బాధగా ఉందన్నారు. మొదటి నుంచి శ్రిఖ తీరుపై బాగుండేది కాదన్నారామె. శ్రిఖా చెప్పే మాటలు అనుమానం కలిగిస్తున్నాయని, జయరాంను మర్డర్ చేసి ఆయన ఫోన్ నుంచి నాకు మెసేజ్ లు చేశారని పద్మశ్రీ ఆరోపించారు.
శ్రిఖాకు డబ్బు పిచ్చి ఎక్కువని, ఎక్స్ ప్రెస్ టీవీ, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఆమె ఎంటరైన తర్వాతే నష్టాల్లోకి వెళ్లాయని పద్మశ్రీ అంటున్నారు. శ్రిఖా తల్లి మమల్ని చాలా బాధలు పెట్టిందని పద్మశ్రీ చెప్పారు. శ్రిఖానే.. రాకేష్ రెడ్డిని ప్రేరేపించి ఈ పన్నాగం పన్నిందని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదని, జయరాంకు విషమిచ్చి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు పద్మశ్రీ..