Thieves Cut Off Old Woman Legs : రాజస్థాన్ లో దారుణం.. వృద్ధురాలి కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లిన దొంగలు
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది.
- bheemraj
- Published On : October 9, 2022 / 03:01 PM IST
thieves cut off old woman legs
Thieves Cut Off Old Woman Legs : రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో వందేళ్ల వృద్ధురాలి కాళ్లకున్న వెండి కడియాలపై దొంగల కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చిన దొంగలు.. వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేసి కడియాలను ఎత్తుకెళ్లారు.
బయటికి వెళ్లిన మనుమరాలు ఇంటికి వచ్చేసరికి వృద్ధురాలు రెండు కాళ్లను కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యాలను చూసి భయపడ్డ ఆమె వెంటనే తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలును వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Theft : అనంతలో దొంగల బీభత్సం.. టీచర్‌ని హత్యచేసి దోపిడీ
సమాచారం అందిన వెంటనే వృద్ధురాలిని తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించామని, ఆమె తెగిపోయిన రెండు కాళ్లను కూడా రికవరీ చేసి వైద్యులకు అప్పగించామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వృద్ధురాలి మెడపై కూడా కత్తి గాట్లు ఉన్నాయన్నారు. దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
