×
Ad

Road Accident : రోడ్డు ప్రమాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుం

  • Published On : December 3, 2021 / 02:15 PM IST

Road Accident

Road Accident :  జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిలో లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద జాతీయ రహాదారిపై టాటా ఏస్ ఆటో, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  టాటాఏస్ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకోసం ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
Also Read : Soft Ware Engineer : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య
మృతులు  హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన జెన్ను చిన్నశేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి,రఘునాధ‌రెడ్డి‌గా గుర్తించారు. వీరు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని బందువు అంత్యక్రియలలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో సంఘటన స్థలంలో విషాద చాయలు అలుముకున్నాయి.