Soft Ware Engineer : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య

సంగారెడ్డి‌  జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.

Soft Ware Engineer : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య

Soft Ware Engineer Family Suicide

Software Engineer  :  సంగారెడ్డి‌  జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. మునిపల్లి మండంలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్   టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.  అతను భార్య లావణ్య, కుమారుడు ప్రథమ్(6) కుమార్తె సర్వజ్ఞ(3)లతో కలిసి బీహెచ్ఈఎల్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ దంపతులు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం లావణ్య తల్లి తండ్రులు రూ. 40 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు. చంద్రకాంత్‌కు   వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణ ఖర్చులకే సరిపోతూ ఉండటంతో ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. ఎంతో కొంత ధన సహాయం చేయాలని తన తల్లితండ్రులను చంద్రకాంత్  కోరగా వారు అందుకు నిరాకరించారు.  గురువారం సాయంత్రం చంద్రకాంత్ కుటుంబ సభ్యులు ఒక గృహ ప్రవేశ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు.

Also Read : Omicron : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటాం-మంత్రి హరీష్‌రావు

అనంతరం చంద్రకాంత్ తన ఇంటి నిర్మాణానికి సంబంధించి డబ్బుల విషయంలో తల్లితండ్రులతో గొడవ పడ్డాడు. రోజూ ఇంటి నిర్మాణం విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో, మనస్తాపానికి  గురైన భార్య లావణ్య పిల్లలిద్దరినీ తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది.  దీంతో చంద్రకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వచ్చిన లావణ్య కొద్దిసేపటి తర్వాత పక్కింటి  వాళ్లకు ఫోన్ చేయగా వాళ్లు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నవిషయం చెప్పారు.

భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నలావణ్య పిల్లలిద్దరినీ జోగిపేట సమీపంలోని ఆందోల్ పెద్ద చెరువులో పడేసి,తాను చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహాలు తేలియాడటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు లావణ్యతో పాటు పిల్లలిద్దరి మృత దేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.