Oxygen Cylinders black market : ఆక్సిజన్ సిలిండర్లు బ్లాకులో అమ్ముతున్న ముఠా అరెస్ట్

స్వచ్చంద సంస్ధ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లును బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్ను ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

Oxygen Cylinder

Oxygen Cylinders black market :  స్వచ్చంద సంస్ధ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లును బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓమ్నీ వ్యాన్ లో ఆక్సిజన్ సిలిండర్లు అక్రమ రవాణా అవుతున్నాయని సమాచారం అందుకున్న మల్కాజ్ గిరి పోలీసు స్టేషన్ ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

సోమవారం రాత్రి పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. మౌలాలీ నుంచి ఈసీఐఎల్ ప్రాంతం వైపు వెళుతున్న ఓమ్నీ వ్యానును పోలీసులు ఆపి తనిఖీ  చేయగా అందులో ఒక్కోటి 150 లీటర్లు సామర్ధ్యం కలిగిన ఐదు ఆక్సిజన్ సిలిండర్లు కనుగొన్నారు.

వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించటంలో డ్రైవ‌ర్‌ స‌యీద్ అబ్దుల్లా(30), మ‌హ్మ‌ద్ మ‌జార్‌(37), జీఎం చౌనీ అనే వారు విఫలమయ్యారు. వాటిని సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు, ఓమ్నీ వ్యాను, ఐదు ఆక్సిజన్ సిలిండర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో సిలిండర్ రూ.16 వేలకు కొనుగోలు చేసి రోగులకు రూ.25 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.