Warangal Road Accident
Road Accident : వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్‌లో జరిగే వివాహానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. ఖానాపురం మండలం, దబ్బిడిపేటకు చెందిన రాకేష్, శిరీష లు అన్నా చెల్లెళ్లు.
వరంగల్ లో ఆదివారం రాత్రి జరుగుతున్న పెళ్ళికి వెళ్లేందుకు ఇద్దరూ బైక్ మీద బయలు దేరారు. నర్సంపేట మండలం మహేశ్వరం శివారు గురజాల క్రాస్ రోడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ ఢీ కొట్టటంతో ఇద్దరూ అక్కడి కక్కడే మరణించారు.
Also Read :Anandaiah Omicron Medicine : ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు చెక్ పెట్టిన గ్రామస్తులు
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలన పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో వీరిద్దరే జీవిస్తున్నారు. వీరికి ఇతర బంధువులు కూడా ఎవరూ లేకపోవటంతో స్దానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలుకు ఏర్పాటు చేయించారు.