Crime News: హర్యానాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..
హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
- Harishth Thanniru
- Published On : August 26, 2022 / 11:58 AM IST
Crime news
Crime News: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వీరు ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత రాలేదు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Crime News: అవివాహితపై నకిలీ స్వామీజీ ఐదేళ్లుగా అత్యాచారం.. భార్యతో వీడియోలు తీయించి బెదిరింపు..
హర్యానా రాష్ట్రం అంబాలాలోని బలానా గ్రామంలో శుక్రవారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. మృతులను సంగత్ రామ్ (65), అతని భార్య మహీంద్రా కౌర్, సుఖ్వీందర్ సింగ్ (34), అతని భార్య రీనాగా గుర్తించారు. చనిపోయిన వారిలో సుఖ్వీందర్ సింగ్ ఇద్దరు కుమార్తెలు అషు (5), జస్సీ (7) కూడా ఉన్నారు.
Crime News: భార్యకు వీడియోకాల్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు సభ్యులు మృతి చెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో నోట్ ను స్వాధీనం చేసుకొని వీరి మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ విషయంపై అంబాల ఏఎస్పీ జోగిందర్ శర్మ మాట్లాడుతూ.. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే ఈనెల ప్రారంభంలో ఇదే తరహా ఘటన జమ్మూలోని సిద్రా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఇంట్లో చనిపోయారు.
