చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం నెలకొంది. రామకుప్పం మండలం పెద్దబల్దారు గ్రామంలో జల్లికట్టులో ఎద్దు పొడిచి ఓ యువకుడు మృతి చెందాడు.
చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం నెలకొంది. రామకుప్పం మండలం పెద్దబల్దారు గ్రామంలో జల్లికట్టు వేడుకలో ఎద్దు పొడిచి ఓ యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు పెద్దూరు గ్రామానికి చెందిన మహబూబ్ బాషాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంప్రదాయబద్దంగా జరిగే జల్లికట్టు ఆట చివరకు హింసాత్మకంగా మారుతుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.
కొద్దిసేపటి క్రితమే పెద్దబల్దారు గ్రామంలో పెద్ద ఎత్తున జల్లికట్టు ఆట నిర్వహించారు. అయితే జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టులో పాల్గొన్న మహబూబ్ బాషా అనే యువకుడిని ఎద్దు పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. ఎద్దు పొడవడంతో మెడ, చాతీ దగ్గర పెద్ద గాయాలు కావడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చిత్తూరు ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీ జల్లికట్టు పోటీలను ఏమాత్రం అనుమతించబోమని వరుసుగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు సంక్రాంతికి ముందు జనవరి 1 నుంచి కనుమ పండుగ వరకు జిల్లాల్లో రోజుకు ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. అయితే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా జల్లికట్టు చాలా సరదాగా సాగేది. కానీ ఈ ఏడాది మాత్రం వరుసగా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి 1న జరిగిన జల్లికట్టులో కూడా ఒక వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు.
ఇవాళ ఎద్దు పొడిచి ఓ యువకుడు చనిపోవడం చాలా దారుణమైన ఘటనగా చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. జల్లికట్టులో పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి. జల్లికట్టులో ఎద్దులతో పోటీలు పెడుతారు. గెలిచిన వ్యక్తికి లక్ష నుంచి రెండు లక్షల వరకు ప్రైజ్ మనీ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రైజ్ మనీకి ఆశపడి రైతులు ఎద్దులను బరిలో దింపుతున్నారు. అయితే అనుభవం లేని ఎద్దులు మనుషులపైకి దాడులకు పాల్పడుతున్నాయి.
మహబూబ్ బాషా కుటుంబం పూర్తిగా అనాధ అయింది. అతనికి పెళ్లై, పిల్లలున్నట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి చాలా సరదాగా జల్లికట్టు వేడుకల్లో పాల్గొన్నాడు. కానీ జల్లికట్టులో పాల్గొనే విషయంలో కూడా శిక్షణ అవసరం ఉంటుంది. ఎద్దు వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎద్దును ఎక్కడ పట్టుకోవాలి అనే విషయాలు తెలిసివుండాలి. ఎలాంటి తర్పీదు లేకుండా మొదటిసారి జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం వల్ల మహబూబ్ బాషాపై ఒక్కసారిగా ఎద్దు ఉరికింది. అతని మెడ, చాతీపై కొమ్ములతో పొడిచి తీవ్రస్థాయిలో గాయాలు చేసింది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స మృతి చెందాడు.