TV actor Sravani Suicide case : శ్రావణి ఆత్మహత్య కేసులో సీసీ ఫుటేజ్ వెలుగులోకి..!

  • Publish Date - September 10, 2020 / 09:50 PM IST

TV actor Sravani suicide case : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకేసులో కొత్త మలుపు తిరిగింది. శ్రీకన్య హోటల్ సీన్ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీలో దేవరాజు, శ్రావణి సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దేవరాజుతో శ్రావణి చనువుగా ఉంటున్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంపై శ్రావణితో కుటుంబ సభ్యులు మాట్లాడారు. అదే రోజు రాత్రి నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో దేవరాజుపై పోలీసు స్టేషన్‌లో శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.



శ్రావణి కేసులో ఏడు గంటలుగా ఆమె ప్రియుడు దేవరాజును పోలీసులు విచారిస్తున్నారు. దేవరాజు పోలీసులకు ఇచ్చిన ఆడియో ఆధారాలు 10టీవీకి చిక్కాయి. సాయి, నిర్మాత అశోక్ బెదిరించిన ఆడియోలు కూడా ఇచ్చాడు. సాయి, ఆశోక్ ప్రోద్బలంతోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని, ఆ విషయాన్ని శ్రావణేనే చెప్పిందని దేవరాజు ఆడియో చూపించాడు.. శ్రావణి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని మొదట చెప్పిన దేవరాజు.. తర్వాత అతడికి శ్రావణికి మధ్య బ్యాంకు లావాదేవీలను పోలీసులు గుర్తించారు.



శ్రావణి తమ్ముడు వెంకట్ అకౌంటుకు దేవరాజు రూ.25వేలు పంపినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై శ్రావణి తమ్ముడు వెంకట్‌ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని సైతం పోలీసులు విచారించే అవకాశం ఉంది. శ్రావణి ఆత్మహత్య కేసులో ఎవరి ప్రమేయం ఉందో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.