విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 న్యూస్ చానెల్‌లో కెమెరా మ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు.
వీడియో జర్నలిస్టు మురళి మృతి పట్ల రాష్ట్ర సమాచార, రవాణా శాఖమంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి పేర్ని నాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కూడా వీడియో జర్నలిస్టు మురళి ప్రసాద్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.