Chain Snatchers : చైన్ స్నాచింగ్ కేసు‌ను చేధించిన పోలీసులు

మేడ్చల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Chain Snatchers : మేడ్చల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ నెల‌ 8 వ తేదీన మేడ్చల్ బండమాదారంలో తన పాలకూర తోటలో పని చేసుకుంటున్న శంకరమ్మ ( 52 ) అనే రైతు దగ్గరకు ఒక వ్యక్తి కారులో వచ్చి 10 రూపాయల పాలకూర ఇమ్మని అడిగాడు.

పాలకూర  ఇచ్చే లోపల శంకరమ్మ మెడలోంచి పుస్తెల తాడు గుంజుకొని పారిపోయాడు.  ఆమె ప్రతిఘటించినా లాభం లేక పోయింది.  అప్పటికే వారు వచ్చిన కారు  సిధ్ధంగా ఉండటంతో నిందితుడు కారులో పారిపోయాడు.

ఆ షాక్ నుండి తేరుకున్న బాధితురాలు తన భర్త శ్రీనివాస్‌రెడ్డి‌తో కలిసి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం‌తో నిందితులను కారుతో సహా పట్టుకున్నారు.
Also Read : Social Media : నగ్నంగా వీడియో కాల్స్-సోషల్ మీడియాలో మహిళలకు వేధింపులు
నిందితులు‌ భౌరంపేట్‌కు చెందిన చిల్ల సంతోష్, చింతా కృష్ణగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 తులాల బంగారు గొలుసు..ఒక సెల్ ఫోన్.. కారు ( TS 09 UB 9861) స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు