ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు యువకుల మృతి

  • Publish Date - April 30, 2019 / 01:55 PM IST

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాచారం మండలం తక్కళపల్లి గేట్ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : వామ్మో.. ఎంత పెద్దదో : నడిరోడ్డుపై భారీ అనకొండ.. ట్రాఫిక్ జామ్