వామ్మో.. ఎంత పెద్దదో : నడిరోడ్డుపై భారీ అనకొండ.. ట్రాఫిక్ జామ్

రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఓ భారీ అనకొండ నడిరోడ్డుపైకి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ మెల్లగా పాకుతూ రోడ్డుపై దర్శనమిచ్చింది.

  • Published By: sreehari ,Published On : April 30, 2019 / 12:29 PM IST
వామ్మో.. ఎంత పెద్దదో : నడిరోడ్డుపై భారీ అనకొండ.. ట్రాఫిక్ జామ్

రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఓ భారీ అనకొండ నడిరోడ్డుపైకి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ మెల్లగా పాకుతూ రోడ్డుపై దర్శనమిచ్చింది.

రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. వాహనాలతో రోడ్డంతా రద్దీగా ఉంది. ఇంతలో ఓ భారీ అనకొండ నడిరోడ్డుపైకి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ మెల్లగా పాకుతూ రోడ్డుపై ప్రత్యక్షమైంది. అంతే.. మూడు మీటర్ల పొడవైన అనకొండను చూసి వాహనదారుల గుండెలు అదిరిపోయాయి. వామ్మో అనకొండ అంటూ బెదిరిపోయారు. ఎక్కడ మింగేస్తుందోనని భయంతో హడలిచచ్చారు.

రోడ్డు దాటుతున్న అనకొండను చూసి వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ భయానక ఘటన బ్రెజిల్ లోని పోర్టో వెల్హో నగరానికి సమీపంలో జరిగింది. రోడ్డు దాటుతున్న అనకొండను ఇటాలో నస్కిమెంటో ఫెర్నాండ్స్ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

భారీ అనకొండ పామును రోడ్డుపై వాహనాదారులంతా అలానే చూస్తుండి పోయారు. నివేదిక ప్రకారం.. ఈ భారీ అనకొండ దాదాపు 3 మీటర్ల పొడవు ఉంటుంది. 30 కిలోల బరువు ఉంటుంది. అనకొండ.. ఆహారం కోసం వెతుకుతూ ఇలా రోడ్డుపైకి వచ్చి ఉంటుందని బ్లాగిస్ట్ ఫ్లావియో టెరస్సిని తెలిపారు.

వర్షాకాలంలో ఎక్కువ చిన్న ఎలుకలు తిరుగుతుంటాయని, జంతువుల వాసన ఆధారంగా అనకొండ పాములు ఆహారం కోసం వెతుకుతూ బయటకు వస్తుంటాయని అన్నారు. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న స్థానికులు జాగ్రత్తగా ఉండాలని, పెంపుడు కుక్కలు, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read : తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!