హనుమాన్ జయంతి రోజు విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో లారీ బీభత్సం సృష్టించింది. ఆంజనేయస్వామి భక్తులపైకి దూసుకెళ్లింది.
హనుమాన్ జయంతి రోజు విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో లారీ బీభత్సం సృష్టించింది. ఆంజనేయస్వామి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఇవాళా హనుమాన్ జయంతి కావడంతో కొండగట్టుకు భారీగా భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే చొప్పదండి మండలం భూపాలపట్నంకు చెందిన పది మంది హన్ మాన్ భక్తులు పాదయాత్రగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు.
Also Read : వాల్మీకిగా వరుణ్ తేజ్ న్యూ లుక్ చూశారా?
మార్గంమధ్యలో దొంగలమర్రి దగ్గర అతివేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి భక్తులను ఢీకొట్టింది. పొన్నం అరుణ్, పులి రాజేందర్ లపై నుంచి లారీ దూసుకెళ్లింది. పొన్నం అరుణ్ పై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో అతని శరీరం నుజ్జునుజ్జయ్యింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన పులి రాజేందర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యంలో మృతి చెందారు.
వీరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. భక్తులను ఢీకొట్టిన తర్వాత లారీ అక్కడి నుంచి వెళ్లి పోయింది. లారీ ఆచూకీని కనుకొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జగిత్యాల, కొండగట్టు మార్గంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డైన సీసీ ఫుటేజీ ఆధారంగా లారీని గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు