బోల్తా పడ్డ కారు : ఇద్దరు విద్యార్ధులు మృతి

  • Publish Date - November 11, 2019 / 04:01 PM IST

సుర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.  సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద  ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌ గురునానక్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్ల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.