అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు.. ఒక్కసారిగా శత్రువులుగా మారి..

నిమజ్జనం తర్వాత నెక్కల చెల్లంనాయుడు, పాటురి సాయి.. ఇద్దరు కలిసి ఓ చోట మద్యం సేవించారు.

Vizianagaram: బ్యాండ్‌ చప్పుళ్లకు ఇద్దరూ కలిసి ఆడారు. సంతోషంగా చెరువు దాకా వెళ్లి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఆ తర్వాత ఓ చోట కూర్చోని మందేశారు. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు..ఒక్కసారిగా శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి తీవ్రరూపం దాల్చింది. ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇంతకు ఏ విషయంలో గొడవ జరిగింది..? ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఇప్పుడిదే మిస్టరీగా మారింది.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడ గ్రామంలో దారుణ హత్య జరిగింది. నెక్కల చెల్లంనాయుడు అనే వ్యక్తిని..పాటురి సాయి అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు.

మధుపాడలో సెప్టెంబర్ 11వ తేదీన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవంలో నెక్కల చెల్లంనాయుడు, పాటురి సాయి పాల్గొన్నారు. డీజే పాటలు, బ్యాండ్ చప్పుళ్ల మధ్య తీన్మార్ డ్యాన్సులు చేశారు. అంతా కలిసి ఆనందంగా గణేశుడి నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.

ఎందుకు హత్య చేశాడో?
నిమజ్జనం తర్వాత నెక్కల చెల్లంనాయుడు, పాటురి సాయి.. ఇద్దరు కలిసి ఓ చోట మద్యం సేవించారు. ఈ సమయంలో ఇరువురికి మాటా మాటా పెరిగింది. ఓ దశలో ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. అయితే ఈ సమయంలో ఆవేశంలో పాటురి సాయి.. బండరాయి తీసుకుని చెల్లంనాయుడు తలపై బలంగా కొట్టాడు. దీంతో చెల్లంనాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం సాయి పారిపోయాడు.

హత్య గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు పాటురి సాయం కోసం గాలిస్తున్నారు.

అయితే చెల్లంనాయుడిని సాయి ఎందుకు హత్య చేశాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఏ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది అనే తెలియాల్సి ఉంది. అయితే గ్రామస్తుల్లో కొందరు..ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని చెప్పుకుంటున్నారు.

Also Read: సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ట్రెండింగ్ వార్తలు