కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు
కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. బరితెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా జిల్లాలో దారుణాలు జరిగాయి. 12 గంటల వ్యవధిలో రెండు గ్యాంగ్ రేప్ ఘటనలు వెలుగుచూశాయి. 14ఏళ్ల దళిత బాలికపై లైంగిక దాడి జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు బాలికలు.. పశువులకు మేత తెచ్చేందుకు పంట పొలాలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఓ బాలిక పారిపోగా, మరో బాలికను పట్టుకుని పొలాల్లోకి లాక్కెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. పారిపోయిన బాలిక కుటుంబసభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు. విషయం తెలిసి గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చేసరికి.. నిందితులు పారిపోయారు.
మరో ఘటనలో 19 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉండే ముగ్గురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అమన్(28), రాం రతన్(26), వివేక్(26) లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆడపిల్లలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : దీదీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే భయం : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు