Shamshabad Airport Gold : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్​ ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Shamshabad Airport Gold : శంషాబాద్​ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. తరుచుగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, అధికారుల కళ్లుగప్పేందుకు ప్రయత్నించి కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు.

దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసిన ఇద్దరు కిలాడీ లేడీలను అరెస్ట్ చేశారు. వారిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. పసిడి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అధికారులు ఎంత నిఘా పెట్టినా.. స్మగ్లర్లు ఊరుకోవడం లేదు. రోజురోజుకు తెలివి మీరి పోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ల కళ్లు కప్పి బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో బంగారం తరలిస్తూ.. చివరికి చిక్కుతున్నారు.