Crime Hyderabad: నగరంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి
చిన్న విభేదాలు.. కత్తుల దాడి వరకు వెళ్తున్నాయి. నగరంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకులపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు
- Bharath Reddy
- Published On : January 23, 2022 / 09:57 AM IST
Crime
Crime Hyderabad: హైదరాబాద్ నగరంలో నేర నియంత్రణ కొరవడింది. యువకుల మధ్య నెలకొన్న చిన్న విభేదాలు.. కత్తుల దాడి వరకు వెళ్తున్నాయి. నగరంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకులపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్..బేగంపేట పీఎస్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున కత్తిపోట్లు కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇలాహి మజీద్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తి పై మునీర్ అనే యువకుడు అతని స్నేహితులు కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రదీప్ ని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై హత్యకు యత్నించిన మునీర్ మరియు అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Viral Video: నీటిలో మునుగుతున్న జింకపిల్లను కాపాడిన శునకం
ఇక సికింద్రబాద్ లోని చిలకలగూడ పిఎస్ పరిధిలోనూ కత్తిపోట్ల కలకలం రేగింది. చిలకలగూడ ఏకశిలా మెడికల్ హాల్ వద్ద..ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణలో సంతోష్ అనే యువకుడిపై నవాజ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. డబ్బుల విషయంలో సంతోష్, నవాజ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. తనకు రావాల్సిన డబ్బును ఇవ్వాలంటూ నవాజ్ సంతోష్ అడగడంతో గొడవ మొదలైంది. సంతోష్ పై ఆగ్రహంతో ఊగిపోయిన నవాజ్..కత్తితో దాడి చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు తీవ్రంగా గాయపడ్డ సంతోష్ ను గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also read: India’s Tallest Man: భారత్ లో అత్యంత పొడగరి సమాజ్ వాదీ పార్టీలోకి
