Viral Video: నీటిలో మునుగుతున్న జింకపిల్లను కాపాడిన శునకం

నీటి ప్రవాహంలో చిక్కుకున్న చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను ఈదుకుంటూ ఆ శునకం, జింక పిల్లను నోట కరుచుకుని..

Viral Video: నీటిలో మునుగుతున్న జింకపిల్లను కాపాడిన శునకం

Dog Deer

Viral Video: పెంపుడు కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలుసు. వాటి యజమానులకు ఎటువంటి ఆపద వాటిల్లినా..కుక్కలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. ఆమాటకొస్తే.. ప్రమాదంలో ఉన్న ఏ జీవినైనా.. కుక్కలు రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది.

Also read: India’s Tallest Man: భారత్ లో అత్యంత పొడగరి సమాజ్ వాదీ పార్టీలోకి

ఉదృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ఓ జింక పిల్ల చిక్కుకుంది. ఎంతకూ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా నీటి వేగానికి అది కొట్టుకుపోతుంది. ఇది గమనించిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను నీటిలోకి వదిలాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను ఈదుకుంటూ ఆ శునకం, జింక పిల్లను నోట కరుచుకుని ఒడ్డుకు చేర్చింది. దీంతో యజమాని ఆ కుక్కను “గుడ్ బాయ్(Good Boy) అంటూ ప్రేమగా తల నిమిరి, ఆ జింక పిల్లను అందుకున్నాడు. నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాల కోసం గిజగిజలాడిన ఆ జింక పిల్ల.. ప్రాణాలు దక్కడంతో బ్రతుకు జీవుడా అనుకుంది. ఈ దృశ్యాన్ని కుక్క యజమాని వీడియో తీయగా..”Universal Gyan 4u” అనే యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వీడియో సూపర్ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు కుక్క సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.

Also read: Monkey Fever: కరోనా సమయంలో మరో పిడుగు: దేశంలో మరోసారి “మంకీ ఫీవర్” కలకలం