India’s Tallest Man: భారత్ లో అత్యంత పొడగరి సమాజ్ వాదీ పార్టీలోకి

భారత్ లోనే అత్యంత పొడగరిగా(ఎత్తు) గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్

India’s Tallest Man: భారత్ లో అత్యంత పొడగరి సమాజ్ వాదీ పార్టీలోకి

Tall Man

India’s Tallest Man: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్ వాదీ పార్టీలోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో కలిసి పనిచేసేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్ లోనే అత్యంత పొడగరిగా(ఎత్తు) గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ పటేల్ ఆధ్వర్యంలో, అఖిలేష్ యాదవ్ సమక్షంలో శనివారం ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నరహర్‌పూర్ కాసియాహి గ్రామానికి చెందిన ధర్మేంద్ర, 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. అంతే కాదు ఆసియా ఖండంలోనూ అత్యంత పొడవైన వ్యక్తుల జాబితాలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఒకరు.

Also read: Monkey Fever: కరోనా సమయంలో మరో పిడుగు: దేశంలో మరోసారి “మంకీ ఫీవర్” కలకలం

భారత్ లో ఎత్తైన వ్యక్తి అనే గుర్తింపు మినహా.. ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కు వ్యక్తిగత జీవితంలో అన్ని అవాంతరాలే ఎదురయ్యేవి. 46 ఏళ్ల ధర్మేంద్ర ప్రతాప్ సింగ్..ప్రతాప్‌గఢ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తైనా.. ఆనాటి నుంచి ఉద్యోగం రాలేదు. తరచూ అనారోగ్యం కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నా చితకా పనులు చేస్తుండేవారు. ఈక్రమంలో అతనికి గుర్తింపు తెచ్చిన ఎత్తే.. శాపంగా మారింది. అసాధారణ ఎత్తు కారణంగా ధర్మేంద్రకు.. నడుం వంగేందుకు సహకరించేది కాదు.

Also read: Telangana Schools: రాష్ట్రంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి

గతంలో నడుం కింది భాగంలో హిప్ జాయింట్ లో నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలనీ సూచించారు. ఉద్యోగమే లేని ధర్మేంద్రకు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి విన్నవించుకున్నాడు. దీంతో 2019లో వైద్యులు ధర్మేంద్రకు హిప్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం రాజకీయ నేతల ప్రచారంలో పాల్గొంటున్న ధర్మేంద్ర సమాజ్ వాదీ పార్టీలో చేరాడు.

Also read: What is Surrogacy: సరోగసీ అంటే ఏమిటీ? సెలెబ్రిటీలు సరోగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు?