Udaipur Killing : ఉదయ్‌పూర్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు

రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్‌లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.

Udaipur Killing :  రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్‌లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.

ఈరోజు తెల్లవారుఝామున అజ్మీర్ లోని హై సెక్యూరిటీ జైలుకు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు నిందితులు రియాజ్ అక్తర్, గౌస్ మహమ్మద్ లను కస్టడీలోకి తీసుకుని ఈరోజు జైపూర్ కోర్టులో హాజరు పరచనున్నారు. పాకిస్తాన్ కు చెందిన సల్మాన్ హైదర్, ఇబ్రహీం అనే వారు ఇద్దరు నిందితులను రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

మహ్మద్ ప్రవక్త గురించి  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఈవివాదం చెలరేగింది. దేశంలో భారీ స్ధాయిలో తీవ్రవాద  దాడులను నిర్వహించటానికి, ఆర్డీఎక్స్  వంటి పేలుడు  పదార్ధాలు పేల్చటానికి  నిందితులు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Also Read : “Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్‌’‌ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు

ట్రెండింగ్ వార్తలు