UP man Arrested : అతని వయస్సు 51 ఏళ్లు … 100 మంది మహిళలను వేధించాడు

UP man Arrested after 66 complaints of harassment by women, girls on phone : మడిసన్నాక కూసింత కలాపోసణ ఉండాలనే పాత తెలుగు సినిమా డైలాగ్ వంటపట్టించుకున్నాడో ఏమో ఉత్తర ప్రదేశ్ కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి ఫోన్ లో దాదాపు 100 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఇతని వేధింపులు భరించలేని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి.

యూపీలోని ఔరియా జిల్లాకు చెందిన రాజేష్(51) మహిళలను లైంగికంగా వేధించేవాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనివద్ద నుంచి రెండు ఫోన్ లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజేష్ కు దాదాపు 200 మంది మహిళలతో పరిచయాలున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. మొదట మహిళలు, యువతులతో పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

అంతటితో ఆగకుండా వారికి అశ్లీల ఫోటోలు మెసేజ్ లు పంపించి పైశాచికానందం పొందేవాడు. కేసును మరింత లోతుగా పరిశీలించగా ఇతనిపై దేశవ్యాప్తంగా 66 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. తొలి వేధింపుల కేసు 2018 లో నమోదైంది. అప్పడు లక్నో ఉమెన్ పవర్ లైన్ పోలీసులు నిందితుడ్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు. అయినప్పటికీ రాజేష్ తీరు మార్చుకోలేదు.

8వతరగతి తప్పిన రాజేష్ ముగ్గురు కుమారులకు తండ్రి. బేలా పోలీసు స్టేషన్ పరిధిలోని జీవాసర్సానీ గ్రామంలో నివసించేవాడు. చాలా మంది మహిళలు ఇతని వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్లీ అపకీర్తి పాలవుతామని ఫిర్యాదు చేయకుండా ఆగిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

నిందితుడిపై ఐపీసీ “సెక్షన్ 354 డి 2 (ఎవరైతే కొట్టే నేరానికి పాల్పడ్డారో), 294 (అశ్లీల చర్యలు మరియు పాటలు),504 (ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అవమానించినా, తద్వారా ఏ వ్యక్తికైనా రెచ్చగొట్టే అవకాశం ఉంది,అలాంటి రెచ్చగొట్టే అవకాశం ఉందని ఉద్దేశించి లేదా తెలుసుకోవడం అతడు ప్రజా శాంతిని విచ్ఛిన్నం చేయడానికి,లేదా మరేదైనా నేరానికి పాల్పడటానికి కారణం) మరియు ఐపిసి యొక్క 507 (అనామక సమాచారమార్పిడి ద్వారా క్రిమినల్ బెదిరింపు) లకింద, పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు