Ranjit Singh became Saddam Sheikh : అల్ ఖైదాలో చేరిన రంజిత్ సింగ్ సద్దాం షేక్‌గా మారినవేళ…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజిత్ సింగ్ అల్ ఖైదాలో చేరి సద్దాం షేక్ గా మారిన విచిత్ర ఉదంతం తాజాగా వెలుగుచూసింది. యూపీలోని గోండా జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ బాల్య దశలో ఉన్నపుడు దొంగతనం చేశాడు....
- saleem sk
- Published On : July 15, 2023 / 07:43 AM IST
Ranjit Singh became Saddam Sheikh
Ranjit Singh became Saddam Sheikh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజిత్ సింగ్ అల్ ఖైదాలో చేరి సద్దాం షేక్ గా మారిన విచిత్ర ఉదంతం తాజాగా వెలుగుచూసింది. యూపీలోని గోండా జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ బాల్య దశలో ఉన్నపుడు దొంగతనం చేశాడు. దీంతో అతని తండ్రి రంజిత్ ను కొట్టడంతో అతను 20 ఏళ్ల క్రితం ముంబయికు పారిపోయాడు.
Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి
రంజిత్ సింగ్ కు ముంబయిలో ఒక ముస్లిం కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అనంతరం అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరిన రంజిత్ సింగ్ తన పేరును సద్ధాం షేక్ గా మార్చుకొని ముస్లింగా మారాడు. (Ranjit Singh became Saddam Sheikh) ఇతను బెంగళూరు నగరంలోని ఒక కంపెనీలో ట్రక్ డ్రైవరుగా పనిచేశాడు. 2020వ సంవత్సరంలో సద్ధాం భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్య, పిల్లలను చంపాలనుకున్నాడు. ఇతను అనంతరం అల్ ఖైదాలో చేరాడు. (started promoting radical ideology)
Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్
పాకిస్థాన్, కశ్మీరులోని అల్ ఖైదా ఉగ్రవాదులతో సద్ధాంకు సంబంధాలు ఉన్నాయని యూపీ ఏటీఎస్ పోలీసులు చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో జరిగిన ఉగ్రవాద ఘటనలను అనుకరిస్తూ బెంగళూరులో దాడులు చేయాలని సద్ధాం భావించాడు. సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తన్న సద్ధాంను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం సద్ధాంను 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించారు.
