Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి

దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్‌తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు.....

Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి

Heavy rainfall alert

Heavy rainfall alert : దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్‌తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. (Heavy rainfall alert for Mumbai) రాయగఢ, రత్నగిరి జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

PM Modi visit : ముగిసిన ఫ్రాన్స్ పర్యటన..అబుదాబీకి వచ్చిన మోదీ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోఈ నెల 18వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ (Himachal) రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల వల్ల 108 మంది మరణించారు. (108 deaths due to floods) ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పట్టాయి. యమునా నదిలో నీటి మట్టం శుక్రవారం రాత్రి నుంచి తగ్గుతోంది. శాంతివన్ ప్రాంతంలో వరదనీరు ముంచెత్తింది.

Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్

ఓల్డ్ రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం శుక్రవారం రాత్రి 11 గంటలకు 207.98 మీటర్లకు తగ్గింది. వరదనీటితో ఢిల్లీ నగరం అతలాకుతలం అయింది. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని కాసోల్ వద్ద తెగిపోయిన రోడ్డును శనివారం పునరుద్ధరించనున్నారు.

Delhi Floods: యమునా నది వరద ఉధృతికి విరిగిపోయిన రెగ్యులేటర్.. భయం లేదన్న కేజ్రీవాల్

కాసోల్, బంజర్, తీర్థన్ ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ ను పునరుద్ధరించామని అధికారులు ట్వీట్ చేశారు. ముంబయి నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.