Uttar Pradesh: చెరుకు తోటకు వెళ్లిన రైతును చంపిన పులి.. మూడు నెలల్లో ఆరుగురి మృతి
పెద్ద పులి దాడిలో రైతు మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, దక్షిణ ఖేరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. పశుగ్రాసం కోసం చెరుకు తోటకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
- Narender Thiru
- Published On : October 30, 2022 / 05:11 PM IST
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రైతుపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఖేరి అటవీ ప్రాంతం, మహేష్ పూర్ పరిధిలోని బాకార్‌గంజ్ అనే గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.
వీర్పాల్ అనే రైతు తన కొట్టంలోని పశువులకు గ్రాసం కోసం దగ్గరలోని చెరుకు తోటకు వెళ్లాడు. అక్కడ చెరుకు తోటలో గ్రాసం సేకరిస్తుండగా, అక్కడికి వచ్చిన పెద్దపులి అతడిపై దాడి చేసింది. వెంటనే గమనించిన స్థానికులు, అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పులి అతడ్ని వదిలేసి అక్కడ్నుంచి పారిపోయింది. వెంటనే తీవ్రంగా గాయపడ్డ వీర్పాల్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీర్పాల్ మరణించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో చర్యలు చేపట్టారు.
Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా
పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ పులి దాడిలో ఆరుగురు మరణించారు.
