Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

బీజేపీలో చేరి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు నటి కంగనా రనౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా స్పందించారు.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

Kangana Ranaut: నటి కంగనా రనౌత్ తన రాజకీయ ప్రవేశం గురించి తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు, బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రస్తావించింది.

Chiranjeevi: సమంతకు మెగాస్టార్ ట్వీట్.. ఈ ఛాలెంజ్ నెగ్గుకొస్తావంటూ భరోసా!

అయితే, ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా స్పందించారు. కంగనా రనౌత్ బీజేపీలో చేరాలనుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, కొన్ని కండీషన్లు వర్తిస్తాయన్నారు. ‘‘కంగనా బీజేపీలో చేరాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే, ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీలో సంప్రదించిన తర్వాతే నిర్ణయిస్తాం. మా పార్టీలో పని చేయాలనుకునే వారికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అయితే, కంగనా పోటీ చేసే విషయంలో నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను. పార్లమెంటరీ కమిటీతోపాటు, గ్రామ స్థాయి నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అలాగే మా పార్టీలో ఎవరినీ ఏ ఒప్పందం మీద తీసుకోం.

Puri Jagannadh: నేను ఎవడినైనా మోసం చేసానంటే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడినే.. పూరి ప్రెస్ నోట్ రిలీజ్!

ఎవరైనా మా పార్టీలోకి రావాలనుకుంటే ఏ షరతులూ లేకుండానే చేరాలి. ఏ కండీషన్లూ పెట్టొద్దు. ఆ తర్వాత వాళ్ల పోటీ విషయంలో పార్టీనే నిర్ణయం తీసుకుంటుంది’’ అని జేపీ నద్దా వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో తమ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు.