Chiranjeevi: సమంతకు మెగాస్టార్ ట్వీట్.. ఈ ఛాలెంజ్ నెగ్గుకొస్తావంటూ భరోసా!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో, ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు ఆమెకు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆమె త్వరగా కోలుకోవాలంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు.

Chiranjeevi: సమంతకు మెగాస్టార్ ట్వీట్.. ఈ ఛాలెంజ్ నెగ్గుకొస్తావంటూ భరోసా!

Chiranjeevi Wishes Samantha To Get Well Soon

Chiranjeevi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో, ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు ఆమెకు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఆమె ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. సమంత కోలుకోవాలని కోరినవారిలో టాలీవుడ్ స్టార్స్ నాని, తారక్, బండ్ల గణేష్, థమన్ వంటి వారు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

ఆయన తాజాగా సమంత ఆరోగ్యం గురించి తెలుసుకుని, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిరు.. ‘‘సమయం మారుతున్నకొద్దీ మన జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. మనలోని శక్తిని బయటపెట్టేందుకు ఇవి వస్తాయి. నువ్వు చాలా మంచి అమ్మాయివి.. నీలో ఉన్న శక్తి అద్భుతమైనది. నువ్వు ఈ ఛాలెంజ్‌ను ఖచ్చితంగా నెగ్గుకొస్తావని నాకు నమ్మకం. నువ్వు ధైర్యంగా, పట్టుదలతో ఉండాలని కోరుతున్నాను..’’ అంటూ పోస్ట్ చేశాడు.

Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరోయిన్‌కు అనారోగ్య పరిస్థితి ఏర్పడంతో ఆమెను చిరు ఓదార్చిన తీరు బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరు చేసిన ట్వీట్‌కు సమంత కూడా థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చింది.